ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతున్న వేళ.. కేరళలో కొత్తరకం మలేరియా జన్యువును గుర్తించారు. ప్లాస్మోడియం ఒవాలే అనే కొత్తరకం పరాన్నజీవిని గుర్తించినట్టు కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ ప్రకటించారు. సుడాన్ నుంచి వచ్చిన ఓ సైనికుడిలో దీనిని గుర్తించామని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడికి కన్నూర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్నట్టు తెలిపారు.
మలేరియాకు కారణమైన ప్రోటోజోవాను ఐదు రకాలుగా పేర్కొంటారు. ప్లాస్మోడియం వివాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం నోలెసి, ప్లాస్మోడియం ఓవాలే. వీటిలో, ప్లాస్మోడియం వివాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపరం దేశంలో సర్వసాధారణం. ప్లాస్మోడియం ఒవాలే సాధారణంగా ఆఫ్రికాలో కనిపిస్తుంది.
దేశంలో తొలిసారిగా కరోనా వైరస్‌ను కేరళలోనే గుర్తించిన విషయం తెలిసిందే. వుహాన్ యూనివర్సిటీలో చదువుకునే కేరళ విద్యార్ధి.. చైనా నుంచి స్వదేశానికి చేరిన తర్వాత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ విద్యార్థికి జనవరి 30న కోవిడ్ నిర్ధారణ కావడంతో త్రిసూర్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహించారు. ఇక, 2018లో నిఫా వైరస్ కూడా కేరళలోనే వెలుగుచూసింది.