విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్‌కు చెందిన ఓడను ఏపీ ప్రభుత్వం రూ.10 కోట్లతో కొనుగోలు చేసి అక్కడే రెస్టారెంట్‌గా మార్చాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని కొనుగోలు చేసి హోటల్‌గా మార్చాలనుకుంటోంది. దీనిపై సచివాలయంలో ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులతో పర్యాటకశాఖ మంత్రి సమావేశమై చర్చలు జరిపారు. ఈ మేరకు బంగ్లాదేశీ ఓడ యజమానితో సంప్రదింపులు జరుపుతున్నారు.