రామ్‌చరణ్‌కు కరోనా పాజిటివ్..

 


దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని మంగళవారం ఉదయం ఆయనే సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు.

నాకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. కానీ ఎలాంటి లక్షణాలు లేవు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే కోలుకుని బలంగా తిరిగి వస్తాను’ అంటూ రామ్‌చరణ్ ట్వీట్ చేశారు. కొద్దిరోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని రామ్‌చరణ్ రిక్వెస్ట్ చేశారు. తన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం వెల్లడిస్తానన్నారు.

కొద్దిరోజుల క్రితం మెగాస్టార్‌ చిరంజీవికి కూడా కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. అయితే ఎన్ని రోజులైనా తనకు లక్షణాలు కనిపించకపోవడంతో చిరంజీవి మరో మూడు చోట్ల టెస్టులు చేయించుకోగా అన్నిచోట్లా కరోనా నెగిటివ్ అని ఫలితం వచ్చింది. ఇప్పుడు రామ్‌చరణ్‌కు కరోనా రావడంతో మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.