నడుం నొప్పి తగ్గాలంటే


నడుం నొప్పి కొన్ని సూచనలు పాటిస్తే  తగ్గిపోతుంది.
* ఆహారంలో కాల్షియం ఉండేలా చూసుకోవాలి. పాలు, గుడ్డు, ఆకుకూరలు, క్యాబేజి, బీన్స్‌, పండ్లు ఇవి రోజూవారి ఆహారంలో తీసుకోవాలి.
* ఇంట్లో పనంతా ముగించుకొని విశ్రాంతి తీసుకుందామని ఎక్కువ మంది మహిళలు భావిస్తారు. ఇది వెన్నెముకపై ఒత్తిడి పెంచుతుంది. పని మధ్యలో విశ్రాంతి తప్పనిసరి.
* బరువులు ఎత్తేటప్పుడు, శ్రమతో కూడిన పనులు చేసేటప్పుడు వంగటం, లేవటం వంటివి త్వరగా చేయకూడదు.
* చాలాసేపు కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు సరైన భంగిమలో ఉండాలి. వెన్నుపై భారం వేయకూడదు.
* కూర్చొని పనిచేసే వారు ప్రతి గంటకు లేచి నాలుగు అడుగులు వెయ్యటం మంచిది.
* నొప్పులు సర్దుకోవాలంటే నిత్యం వ్యాయామం కీలకం. వెన్ను నొప్పికి సంబంధించిన ఐసోమెట్రిక్‌, ఫ్రీ రెసిస్టెన్స్‌ వ్యాయామాలు చేయాలి. అయితే వెన్నునొప్పి వస్తున్న సమయంలో ఇవి చేయకూడదు.
* నొప్పి తక్కువగా ఉన్నప్పుడే జాగ్రత్తలు పాటించాలి. నడుముకు పెట్టుకునే లాంబర్‌ బెల్టులతో ప్రయోజనం తక్కువ. ఎక్కువసేపు బెల్టు పెట్టుకోవడం వల్ల ఆ కండరాలు బలహీనమయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు.