ఇమ్యూనిటీ ఫుడ్‌ జొన్న దోశ


కావాల్సిన పదార్థాలు


జొన్నలు: రెండున్నర కప్పులు


బియ్యం: అర కప్పు


మినప్పప్పు: కప్పు 


నువ్వుల నూనె: పావు కప్పు


ఉప్పు: తగినంత


తయారు చేసే విధానం: 


పదార్థాలన్నిటినీ రాత్రిపూట విడివిడిగా నానబెట్టుకోవాలి. ముందు మినప్పప్పును మెత్తగా రుబ్బుకొని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత జొన్నలు, బియ్యాన్ని రుబ్బి మినప్పిండిలో వేసుకోవాలి. ఈ పిండి మరీ గరిటె జారుడుగా లేకుండా చూసుకోవాలి. తగినంత ఉప్పు కలిపి పులవనివ్వాలి. దోశ వేయడానికి సరిపడా నీళ్లు కలపాలి. పిండిని వేడి పెనం మీద వేసుకోవాలి. చుట్టూ నూనె వేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. దీన్ని కొబ్బరి లేదా అల్లం పచ్చడితో కలిపి తీసుకోవచ్చు. 


లాభాలు: తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు లభిస్తాయి. మధుమేహంతో బాధపడేవాళ్లు జొన్న దోశెలను అల్పాహారంగా తీసుకుంటే మంచిది. రుచికి అల్లం, వెల్లుల్లి,  వేసుకోవచ్చు. వీటిలోనూ పోషక విలువలు అపారం.