మరోసారి యముడిగా కైకాల సత్యనారాయణ..


కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎం.పూర్ణానంద్‌ దర్శకత్వంలొ తెరకెక్కుతున్న చిత్రం దీర్ఘ ఆయుష్మాన్ భవ డా ఎంవికె.రెడ్డి సమర్పణలో ప్రతిమ.జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. 'కొంచం కొంచం కొంచం దగ్గరైపో' అంటూ సాగిపోతున్న ఈ లిరికల్ సాంగ్ రొమాంటిక్ సన్నివేశాలతో యూత్‌ని యమ ఆకర్షిస్తోంది. చాలా రొజుల తర్వాత సీనియర్ యాక్టర్ కైకాల సత్యనారాయణ  యముడిగా ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం.


ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఈ మూవీ ఉండనుందని, సోషియో ఫాంటసీ ప్రేమకథా సినిమాగా మీ ముందుకొస్తున్నామని డైరెక్టర్ పూర్ణానంద్‌ అన్నారు. చిత్రీకరణ పూర్తయిందని, గ్రాఫిక్స్ కు ఈ సినిమాలో చాలా ప్రాధాన్యత ఉందని ఆయన అన్నారు. త్వరలొనే సినిమాను ఈ మూవీ విడుదల తేదీ ప్రకటిస్తామని తెలిపారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత ప్రతిమ.జి తెలిపారు. కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి బాగా నటించారని అన్నారు. ఈ సినిమాకు వినోద్ యాజమాన్య సంగీతం సమకూర్చగా.. పృథ్వీరాజ్‌,సత్యం రాజేష్, జెమినిసురేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.