24 గంటల్లో 19,148 కేసులు నమోదు, 434 మంది మృతి
దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 19,148 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 434 మంది కరోనాతో మరణించినట్లు వెల్లడించింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,04,641కి చేరగా, మఅతుల సంఖ్య మొత్తం 17,834కి పెరిగింది. 2,26,947 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందతుండగా, ఇప్పటివరకు 3,59,860 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 59.43 శాతంగా ఉన్నట్లు తెలిపింది. గత 12 రోజుల్లో దేశంలో కరోనా కేసుల సంఖ్య సుమారు 2 లక్షలకు చేరిందని కేంద్రం పేర్కొంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 1,80,298 కరోనా కేసులు నమోదుకాగా, ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 8,053 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో ఇప్పటివరకు 94,049 కరోనా కేసులు నమోదు కాగా, 1,264 మంది మఅతి చెందారు. ఢిల్లీలో 89,802 కరోనా కేసులు నమోదు కాగా, 2,803 మంది ప్రాణాలు కోల్పోయారు.