ఒకేరోజు 598 మంది మృతి


అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అమెరికాలో కోవిడ్‌-19తో 598 మంది మరణించారు. తాజా మరణాలతో దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 1,04,356కు పెరిగిందని జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. అమెరికాలో ప్రపంచంలోనే అత్యధికంగా 18,37,170 కరోనా కేసులు అధికారికంగా నమోదయ్యాయి. కాగా మహమ్మారి బారినపడి ఇప్పటివరకూ 5,99,867 మంది కోలుకున్నారు. ఇక అమెరికాలో కరోనా మరణాల రేటు 5.2 శాతంగా నమోదైంది. న్యూయార్క్‌లో అత్యధికంగా 3.6 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా 29,289 మంది మరణించారు.