విజయవాడ మీదుగా నడవనున్న 14 రైళ్లు


ఏపీలో నేటి నుంచి ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కాయి. విజయవాడ మీదుగా 14 రైళ్లు నడువనున్నాయి. విజయవాడ మీదుగా ముంబై, భువనేశ్వర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలకు రాకపోకలు జరుగనున్నాయి. ఇందు కోసం నాలుగు నెలల ముందు నుంచే రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని రైల్వే శాఖ కల్పించింది. రిజర్వేషన్ ఉన్నవారికి మాత్రమే రైల్వే స్టేషన్లోకి అనుమతించనున్నారు. థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాత టికెట్ ఉన్న వారికి మాత్రమే స్టేషన్లోకి అనుమతి ఇవ్వనున్నారు. గుంటూరు నుండి విజయవాడ మీదుగా గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్‌కు బయలుదేరింది. ఇంటర్ స్టేట్ ట్రైన్ ప్రయాణాన్ని రైల్వేశాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ఇంటర్ స్టేట్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళ టికెట్లు క్యాన్సల్ చేయబడ్డాయి. రిజర్వేషన్ పూర్తి మొత్తం సొమ్మును రైల్వేశాఖ తిరిగి ఇవ్వనుంది.