విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకేజీతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, వందల మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిశ్రమ నుంచి స్టెరీన్ అనే గ్యాస్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ గ్యాస్ వల్ల తొలుతగా తలనొప్పి, వినికిడి సమస్య, నీరసం, కళ్ళు మంటలు వస్తాయి. ఇదే గ్యాస్‌ను ఎక్కువగా పీలిస్తే క్యాన్సర్, కిడ్నీ వంటి వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది. అయితే గతంలో కూడా ఈ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్‌లీక్ వచ్చినప్పటికీ కంపెనీ యాజమాన్యం వెంటనే అప్రమత్తమై వాటిని అరికట్టే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.