గ్యాస్‌ లీక్‌ ఘటనపై నిపుణులు, శాస్త్రవేత్తలతో పలు కమిటీలు


విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై నిపుణులు, శాస్త్రవేత్తలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కమిటీలు వేశాయి. ఇప్పటికే ఒకట్రెండు కమిటీలను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా.. మరో ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేసింది. గ్యాస్‌ లీక్‌ ఘటనపై ప్రొసిజర్ పాటించారా..? లేదా..? అనే అంశంపై ఇంటర్నల్‌ కమిటీ అధ్యయనం చేయనుంది. మరోవైపు.. ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో అధ్యయన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరపున మల్టీ మెంబర్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం విదితమే.