నిన్నటి వరకు లాక్‌డౌన్‌తో తాళం పడిన పరిశ్రమలు, కార్యాలయాలు, మద్యం దుకాణాలు నేటి నుం చి(సోమవారం) తెరుచుకోనున్నాయి. మూడో దశ లాక్‌డౌన్ ప్రారంభం అవుతున్నప్పటికీ కరో నా ప్రభావం లేని గ్రీన్ జోన్లలో కొన్ని జాగ్రత్త లు పాటిస్తూ అన్ని కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఆయా ప్రాంతాల్లో దాదాపు 40 రోజుల సుదీర్ఘ విరా మం తర్వాత కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి దాకా జిల్లాను యూనిట్‌గా తీసుకొని లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతున్నా యి. అయితే, రాష్ట్రంలో మండలాన్ని యూనిట్ గా తీసుకొని సూక్ష్మస్థాయి ప్రణాళికలు అమలు చేయాలని సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జన సంచారం, వ్యాపార, వాణిజ్యరం గాల నిర్వహణపై సర్కారు మరింత స్పష్టత ఇవ్వనుంది.
ప్రస్తుతం లాక్‌డౌన్ వల్ల కేసులు లేని ప్రాంతాల్లోనూ నిరంతర నిషేధాజ్ఞలు అ మలవుతున్నాయి. ఒక ఊరి నుంచి మరో ఊరి కి ప్రయాణాలు కూడా బంద్ అయ్యాయి. కొత్త గా ఇచ్చే మార్గదర్శకాల్లో గ్రీన్‌జోన్ల పరిధిలో ప్రయాణాలతోపాటు వ్యక్తుల కదలికలు, దుకాణాలు, రైతుబజార్ల నిర్వహణపై పలు సడలింపులు ఇవ్వనున్నారు. కేంద్ర మార్గదర్శకాలకు లోబడి గ్రీన్‌జోన్లలో జన సంచారంపై ఉదయం ఆరు నుంచి రాత్రి 7 గంటల వరకు వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. దీనివల్ల గ్రీన్‌జోన్ల పరిధిలోనే జన సంచారం, ప్రయాణాలు సాగించడానికి వీలవుతుంది. ఆరెంజ్ జోన్లలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు జనసంచారం, వాహనాల రాకపోకలకు వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. రెడ్‌జోన్లలో ఇప్పటికే ఉదయం ఆరు నుంచి 9 వరకు వెసులుబాటు ఉంది. దీన్నే కొనసాగించనున్నారు. కరోనా కేసులు లేని గ్రీన్‌జోన్లలో ఎక్కువ వెసులుబాట్లు ఇవ్వనున్నందున వ్యవసాయం, దాని అనుబంధరంగాలు 85 శాతం మేర గాడినపడనున్నాయి.
494 మండలాల్లో 12 గంటలు
రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాని(గ్రీన్) మండలాలు 494 ఉన్నాయి. అయితే, ఇందులో 120 దాకా బఫర్‌జోన్‌లోకి వచ్చాయి. ఇప్పటిదాకా కేసులు నమోదుకాలేదు. కానీ, వాటిచుట్టుపక్కల మండలాల్లో మాత్రం ఒకటి అంతకన్నా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అయినా అవి కూడా గ్రీన్‌జోన్ పరిధిలోకి తీసుకొస్తారని సమాచారం. గ్రీన్ మండలాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు వెసులుబాట్లు కల్పిస్తారని తెలిసింది. మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ, భౌతిక దూరం విధిగా పాటించాలన్న నిబంధనతో వ్యాపారం, వాణిజ్యం, ఇతర రంగాలు 33% సిబ్బందితో పనిచేసేకునేలా అనుమతులు ఇవ్వనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు వీలుంటుంది. ఉపాధి హామీ కింద వ్యవసాయ కూలీలు, శ్రామికులకు పని కల్పించనున్నారు. నిర్మాణరంగంలో పనులు ప్రారంభం కానున్నాయి. తాపీ మేస్త్రీలు, కూలీలకు ఉపాధి దొరకనుంది. సోమవారం నుంచి గ్రీన్‌జోన్‌లో ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్మాణరంగ పనులు చేపట్టవచ్చని సర్కారు అనుమతి ఇచ్చింది. ప్రజా రవాణాకోసం 50ు ఆక్యుపెన్సీతో బస్సులు నడుపొచ్చు. అయితే, ఆదివారం అర్ధరాత్రి వరకు ఆర్టీ బస్సుల కదలికలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. బస్సు డిపోలు ఎక్కువగా పట్టణాలు, నగరాల్లోనే ఉన్నాయి. అవి కట్టడి ప్రాంతాల పరిధిలో ఉండటంతో బస్సులను ఎలా నడపాలన్న చర్చ జరుగుతోంది. అయితే, క్యాబ్, టాక్సీ సర్వీసులను కూడా గ్రీన్‌జోన్ల పరిధిలో అనుమతించారు. ఒక డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులతో క్యాబ్‌లను నడిపేలా అనుమతి ఇచ్చారు. భారీ మాల్స్ మినహా మిగతా దుకాణాలను నిర్వహించుకోవచ్చని ఇదివరకే వెసులుబాటు ఇచ్చారు. పోస్టల్ సేవలతోపాటు కొరియల్ సర్వీసు అందించే సంస్థలు ఇకపై పనిచేస్తాయి.
ఆరెంజ్ జోన్లలో క్యాబ్ సర్వీసులు
ఆరెంజ్ జోన్‌లో ఉన్న 78 మండలాల్లో క్యాబ్, టాక్సీ సర్వీసులు నిర్వహించుకోవచ్చు. అయితే అవి ఈ జోన్ పరిధిలోనే ఉండాలి. గ్రీన్‌జోన్ లేదా రెడ్‌జోన్‌లలోకి అనుమతించరు. ఒక క్యాబ్‌లో డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. కార్లలో ఇద్దరిని, బైక్‌లపై ఇద్దరిని అనుమతిస్తారు.
రెడ్‌జోన్‌లోనూ సడలింపులు
రెడ్‌జోన్లలోనూ పలు సడలింపులు ఇచ్చారు. వాణిజ్య, ప్రైవేటు కార్యకలాపాలకు అవకాశం ఇచ్చారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవలను తిరిగి కొనసాగించవచ్చు, కాల్‌సెంటర్లు, పరిశ్రమలు, ఐటీ హార్డ్‌వేర్ యూనిట్‌లు కూడా పనిచేస్తాయి. అయితే, జన సంచారం, వాహనాల కదలికలు, షాపుల నిర్వహణపై ఆంక్షలు కొనసాగుతాయి. కాగా, రాష్ట్రంలో మండలం యూ నిట్‌గా జోన్‌ను నిర్ధారించారు. దీనిప్రకారం.. రెడ్‌జోన్‌లో 104, ఆరెంజ్ జోన్‌లో 78, గ్రీన్‌జోన్‌లో 494 మండలాలు ఉన్నాయి.