గ్యాస్ బాధితులకు వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచితవైద్యం: మల్లికార్జున


గ్యాస్ బాధితులకు వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచితవైద్యం అందిస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో మల్లికార్జున ప్రకటించారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో లేని ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా.. ఇతర ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని తెలిపారు. గరిష్ఠపరిమితి లేదని వైద్యఖర్చులు ఎంతయినా ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఆస్పత్రులకు సమాచారమిచ్చామని మల్లికార్జున తెలిపారు.