వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌వో) హెచ్చరించింది. కరోనా మనతోపాటే ఉంటుందని, దానితో సహజీవనం చేయక తప్పదని డబ్ల్యుహెచ్‌వో ఎమర్జెన్సీస్ నిపుణుడు మైక్ రియాన్ వ్యాఖ్యానించారు. ఒక వైళ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా వైరస్‌ను నియంత్రించడం కష్టమైన పని అని, ప్రపంచం మొత్తం ఇందుకోసం విశేష కృషి చేయాలని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వంద రకాల వ్యాక్సిన్ల మీద ప్రయోగాలు జరగుతున్నాయని, వీటి ద్వారా వైరస్ నియంత్రణ ఎంతమేరకు అవుతుందో చెప్పలేమని, వ్యాక్సిన్ల కారణంగా కొత్త రోగాలు వచ్చే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహామ్మారి కూడా హెచ్‌ఐవి లాగానే మనతోపాటే ఎక్కువ కాలం కొనసాగుతుందని, అన్ని స్థాయిలో దీన్ని నియంత్రించేందుకు అందరూ పరస్పర సహకారంతో పనిచేయడమే పరిష్కారమని రియాన్ అభిప్రాయపడ్డారు.
వ్యాక్సిన్ వచ్చినా కరోనా కష్టాలు తీరవు
• R UMADEVI