కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 17 వరకు లాక్‌డౌన్ కొనసాగనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని మినహాంపులు ఇస్తూ రెడ్ జోన్లలో ఆంక్షలు కొనసాగించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ శుక్రవారం (మే 1)న ఉత్తర్వాలు జారీ చేసింది. ప్రధాని మోదీ సమీక్షా సమావేశం ఈ విషయాన్ని వెల్లడించారు.
లాక్‌డౌన్ పొడిగింపు అంశంపై ప్రధాని మోదీ శనివారం ఉదయం మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటలకు ఆయన మీడియా ద్వారా వివరాలు వెల్లడించారు. ఎలాంటి అంశాలను మినహాయింపులు ఇస్తారు? మినహాయింపులు ఇచ్చిన చోట్ల కార్యకలాపాలు ఎలా సాగించాలి తదితర అంశాలపై వివరించనున్నట్లు తెలుస్తోంది.