మరోసారి విషంచిమ్మిన ఎల్‌జిపాలిమర్స్‌


విశాఖలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జి పాలిమర్స్‌ నుండి మరో సారి విషవాయువు లీకైంది. ఈ వాయువు ప్రభావంతో సచివాలయంలో విఆర్‌ఒ తులసి స్పృహ కోల్పోయారు. ఇళ్లలోనే మరో ముగ్గురు సొమ్మసిల్లి పడిపోయారు. బాధితులను గోపాలపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. గత వారం ఎల్‌జి పాలిమర్స్‌ నుండి విడుదలైన స్టెరిన్‌ ప్రభావంతో 12 మంది మృత్యువాతపడగా, పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.