దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలెండర్ ధర భారీగా తగ్గింది. సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరుపై మెట్రో నగరాల్లో రూ.192 వరకు తగ్గిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) ఈ రోజు ప్రకటించింది. మూడు నెలల్లో వరుసగా మూడోసారి గ్యాస్ ధరలు తగ్గాయి. నేటి నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. తగ్గించిన ధరల మేరకు ప్రస్తుతం 14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరు ధర ఢిల్లీలో రూ.581.50గా ఉంది. నిన్నటి వరకు రూ.744గా ఉండేది. కోల్‌కతాలో నిన్నటి వరకు 774.50గా ఉన్న సిలెండర్ ధర ఇప్పుడు రూ.584.50కి తగ్గింది. ముంబైలో నిన్న వరకు 714.50 ఉన్న ధర ఇప్పుడు 579 రూపాయలు అయింది. చెన్నైలో నిన్నటి వరకు 761.50గా ఉన్న ధర ఇప్పుడు 569.50గా ఉంది. మూడు నెలల నుంచి ఇప్పటివరకు ఢిల్లీలో సిలెండర్ ధర మొత్తం రూ.277 తగ్గింది.r
తగ్గిన వంట గ్యాస్ ధర