విశాఖలోని ఆర్.ఆర్ వెంకటాపురం గ్రామంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో విషవాయువు లీకైన ఘటనలో బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. స్టైరీన్ ప్రభావిత గ్రామాల్లోని బాధితులకు శుక్రవారం సాయంత్రానికి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందజేస్తామని మంత్రి వివరించారు. గ్రామాల్లో ఇంకా విషవాయువు ప్రభావం ఉందంటూ టీవీల్లో చూపిస్తున్నారని.. అది నిజం కాదన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రతిపక్ష నాయకులు ఎక్కడున్నారని మంత్రి ప్రశ్నించారు. కరోనా వస్తుందనే భయంతో బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రజల్లో లేదని.. అది జూమ్ పార్టీ అయిపోయి టీవీలకే పరిమితమైందని బొత్స విమర్శించారు.
విశాఖ ఘటన.. అదంతా నిజం కాదు: బొత్స
• R UMADEVI