విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై హైకోర్టులో పిల్


విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. భాస్కర్ అనే న్యాయవాది ఈ పిల్‌ను దాఖలు చేశారు. విశాఖ ఘటనలో బాధితులకు జీవిత కాలం వైద్యం అందించాలని పిటిషన్‌లో కోరారు. బాధితులకు అందించిన నష్ట పరిహారం కంపెనీ రూల్స్‌కు అనుగుణంగా మరింత ఇవ్వాలన్నారు. ఇప్పటికే ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం... ఆ కేసుతో పాటు ఈ పిటిషన్‌ను కూడా విచారించాలని వాయిదా వేసింది.