పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ఫేక్: కమిషనర్



సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను నమ్మవద్దని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు అంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు ప్రచారం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈనెల 18 నుంచి 25 వరకు పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను వాట్సప్ ద్వారా విపరీతంగా ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్.. ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనికి సంబంధించి సైబర్ క్రైం అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చినవీరభద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు.