పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు జర్నలిస్టులకు అభినందనలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేసిన ఆయన.. వృత్తిపరమైన ఒత్తిళ్లను అధిగమించి, పాలకుల వేధింపులను తట్టుకుని, నిష్పాక్షికంగా వార్తలను అందిస్తూ ప్రజా చైతన్యం కోసం మీడియా చేస్తున్న కృషి నిరుపమానమన్నారు. పత్రికా స్వేచ్ఛకు ఎప్పుడు ప్రమాదం వాటిల్లినా టీడీపీ ముందుండి పోరాడుతోందని ఆయన అన్నారు. వైఎస్ హయాంలో జీవో 938కు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జీవో 2430కు వ్యతిరేకంగా పోరాటం చేశామని గుర్తు చేశారు. ప్రశ్నించే గొంతును నొక్కాలని చూడడం హేయమన్నారు. పత్రికలకు నిజమైన స్వేచ్ఛ ఉంటుందో అక్కడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని పేర్కొన్నారు. పాత్రికేయులపై తప్పుడు కేసులు పెట్టడం ఇప్పటికైనా మానుకోవాలని వైసీపీ సర్కార్‌కు సూచించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ప్రజారోగ్యం కోసం పాటుపడాలని జర్నలిస్టులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
అప్పుడు వైఎస్ పాలనలో.. ఇప్పుడు జగన్ సర్కార్‌లో.. చంద్రబాబు
• R UMADEVI