8న వాయుగుండం

దక్షిణ అండమాన్‌ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 8 నాటికి వాయుగుండంగా మారనుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనుకూల పరిస్థితులు మందగించినందునే ప్రస్తుతం అల్పపీడనంగా కొనసాగుతుందని చెప్పారు. ఈ నెల 7వ తేదీ నాటికి ఈ అల్పపీడనం బలపడి, 8 నాటికి వాయుగుండంగా మారనుందని తెలిపారు. వాయుగుండం కదలిక ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు ఉంటుందా? లేదా? అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని వెల్లడించారు. బర్మా, మయన్మార్‌ తీరం వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
క్యుములోనింబస్‌ మేఘాల వల్లే రాష్ట్రంలో వర్షాలు
క్యుములోనింబస్‌ మేఘాల వల్లే ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయని తెలిపారు. దక్షిణ అండమాన్‌ సముద్రం ఏర్పడిన అల్పపీడనానికి, దీనికి ఎటువంటి సంబంధమూ లేదని తెలిపారు.