ఒక్క రోజులో 6వేలకు పైగా కేసులు..


మొదట చైనా, తరువాత ఇటలీ, స్పెయిన్, ఇంగ్లాండ్.. ఆ తరువాత అమెరికా.. ఇప్పుడు రష్యా, బ్రజిల్.. ఇలా దశల వారీగా ప్రపంచంలోని అనేక దేశాలు కరోనా మహమ్మారికి బలవుతూనే ఉన్నాయి. ఓ దేశంలో కరోనా కొంత తగ్గిందంటే.. మరో దేశంలో విజృంభిస్తోంది. ఈ రోజు ఒక్కరోజే బ్రజిల్‌లో దాదాపు 6వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు, దాదాపు 500 మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్యశాఖ వివరాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొత్తగా 6,760 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 496 మంది మరణించారని తెలిపింది. వీటితో కలుపుకొని 1.63 లక్షల మంది కరోనా బాధితులను ఇప్పటివరకు గుర్తించినట్లు వివరించింది. వీరిలో 11,168 మంది మృత్యువాత పడినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా మరణించిన వారికి నివాళిగా మూడు రోజులపాటు సంతాపం ప్రకటిస్తున్నట్లు బ్రెజిల్ పార్లమెంట్ ప్రకటించింది.