జూన్‌ 30 వరకు ట్రైన్స్‌ రద్దు


లాక్‌డౌన్‌ సమయంలో రైల్వేశాఖ రెగ్యులర్‌ ప్యాసింజర్‌ ట్రైన్స్‌ను రద్దు చేసింది. జూన్‌ 30 వరకు ఈ ట్రైన్స్‌ తిరగవని, అయితే ప్రత్యేక రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు, వలసకార్మికులను తరలించే శ్రామిక్‌ రైళ్లు మాత్రం యథావిథిగా నడుస్తాయని ప్రకటించింది. అలాగే ట్రైన్‌ టికెట్ల రద్దు నిబంధనలను కూడా జారీ చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జూన్‌ 30 వరకు టికెట్లను బుక్‌ చేసుకున్న ప్యాసింజర్లకు టికెట్‌ డబ్బులు రిఫండ్‌ చేస్తామని ప్రకటించింది. పిఎన్‌ఆర్‌ కౌంటర్‌ టికెట్లు కలిగిన ప్యాసింజర్లు ఆరు నెలలలోగా టికెట్లను సమర్పించి డబ్బులు తీసుకోవాలని, అలాగే ఇ-టికెట్ల ప్యాసింజర్లకు వారి డబ్బులు బ్యాంక్‌ ఖాతాలో జమవుతాయని వెల్లడించింది. రద్దు కాని ట్రైన్స్‌లో ఒక వేళ ప్యాసింజర్లు ప్రయాణించలేకపోతే వారికి కూడా టికెట్‌ డబ్బులు రిఫండ్‌ చేస్తామని తెలిపింది. కాగా, మార్చి 21 నుండి ప్రయాణించాలనుకున్న వారికి ఈ తాజా నిబంధనలు వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌ ట్రైన్స్‌ను అనుమతించకపోవడంతో ఐఆర్‌సిటిసి తేజాస్‌ రైళ్లను నడిపే అవకాశం లేదు. అలాగే ఈ రైళ్లు నడిచే మార్గంలో అధిక సంఖ్యలో కరోనా వైరస్‌ హాట్‌స్పాట్స్‌ ఉండటంతో ఇప్పటికి తిరిగే అవకాశం లేనట్లేనని సంబంధిత అధికారులు తెలిపారు.