24 గంటల్లొ 58 కొత్త కేసులు

ఏపీలో కరోనా ఉధృతి తగ్గట్లేదు. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందే కానీ అస్సలు తగ్గట్లేదు. ఓ వైపు కేసులు పెరిగిపోతుండటం.. మరోవైపు అనుమానితుల సంఖ్యతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడచిన 24 గంటల్లో (శనివారం ఉదయం 9:00 గంటల నుంచి ఆదివారం ఉదయం 9:00 గంటల వరకు) 58 కొత్త కేసులు నమోదయ్యాయని ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఈ కొత్త కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1583కు చేరుకుంది. 


కొత్త కేసుల లెక్కలు ఇవీ..


గడిచిన 24 నమోదైన కేసుల్లో లెక్కలు ఇలా ఉన్నాయ్.. అనంతపురం- 07, చిత్తూరు-01,  గుంటూరులో-11, కృష్ణా- 08, కర్నూలు-30, నెల్లూరు-01 కేసులు నమోదయ్యాయి. అయితే కడప, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్తగా కేసులేమీ నమోదు కాలేదు. విజయనగరంలో మాత్రం ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.


డిశ్చార్జ్‌, మరణాలు..


గడిచిన 24 గంటల్లో 47 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 488కి చేరుకుంది. 24గంటలుగా ఎలాంటి మరణాలు సంభవించలేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ 33 మంది మరణించారు. ప్రస్తుతం 1062 మంది చికిత్స తీసుకుంటున్నారని ప్రభుత్వం గణాంకాల్లో పేర్కొంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో  6534 శాంపిల్స్‌ను పరీక్షించగా 58 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.


కర్నూల్‌లో తగ్గని కేసులు..


రాష్ట్రంలో ఎక్కువ కేసులు కర్నూలు జిల్లాలోనే నమోదవుతున్నాయి. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయ్. ఈ జిల్లాలో రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు. ఇవాళ కొత్తగా 30 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కర్నూల్‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 466.