రైల్వే టికెట్ కౌంటర్లు తెరుస్తున్నాం


త్వరలోనే రైల్వే కౌంటర్లు తెరుస్తున్నామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. టికెట్ల విక్రయాలు ఇకపై రైల్వే కౌంటర్ల ద్వారా కూడా జరపబోతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా జూన్ ఒకటి నుంచి తిరిగి ప్రారంభమయ్యే రైలు సర్వీసులకు ఆన్‌లైన్‌బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయన్నారు. ప్రతిరోజూ వివిధ మార్గాల్లో నడిచే 200 రైలు సర్వీసులకు ప్రస్తుతం రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ తరుణంలో పీయూష్ గోయల్ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రతో సోషల్ మీడియాతో ముచ్చటించారు.