విజయనగరం జిల్లా పరిషత్ అతిథి గృహంలో కరోనా టెస్టింగ్ కిట్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి శుక్రవారం ప్రారంభించారు. విజయనగరం జిల్లాకు 1680 కరోనా రేపిడ్ టెస్టింగ్ కిట్లు చేరాయి. కరోనా టెస్టింగ్ కిట్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ప్రారంభించిన అనంతరం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. కరోనా టెస్ట్ లో నెగిటివ్ గా నిర్ధారణ అయింది. నిముషం వ్యవధిలో టెస్టింగ్ చేసి అధికారులు ఫలితాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఓ ఎస్‌వి.రమణ కుమారి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కరోనా టెస్టింగ్ కిట్లను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి