బ్యాంక్ కస్టమర్లకు ఈఎంఐ మారటోరియం ఆప్షన్

కరోనా వైరస్ దెబ్బకి దేశం మొత్తం లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ కస్టమర్లకు ఇబ్బంది లేకుండా లోన్ ఈఎంఐపై 3 నెలల మారటోరియం ప్రకటించింది. దీంతో ఇప్పుడు బ్యాంకులు అన్ని ఒక్కొక్కటిగా ఈ ఫెసిలిటీని కస్టమర్లకు అందిస్తున్నాయి. దేశీ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ, దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ, ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకులు తమ కస్టమర్లకు ఈఎంఐ మారటోరియం సౌకర్యాన్ని అందిస్తున్నాయి.


స్టేట్ బ్యాంక్ కస్టమర్లు లోన్ ఈఎంఐ కట్టకూడదు అనుకుంటే.. బ్యాంక్‌కు న్యాక్ ఎక్స్‌టెన్షన్ ఫామ్‌ను ఫిల్ చేసి ఒక మెయిల్ పంపించాలి. బ్యాంక్ సర్కిల్ ప్రాతిపదికన ఈ మెయిల్ ఐడీ మారుతుంది. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో మెయిల్ ఐడీ వివరాలు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు ఒకవేళ ఈఎంఐ కట్టాలి అనుకుంటే.. ఏం చేయాల్సిన పనిలేదు. అకౌంట్ నుంచి మీ డబ్బులు కట్ అవుతాయి. ఈమెయిల్ ఐడీ, న్యాక్ ఎక్స్‌టెన్షన్ ఫామ్ కోసం ఈ https://www.sbi.co.in/stopemi లింక్‌పై క్లిక్ చేయండి. లేదంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఒక లెటర్ రాసి ఇచ్చి ఈఎంఐ మారటోరియం ఫెసిలిటీ పొందొచ్చు.