రాష్ట్రంలో ఇప్పటికే 1.3 కోట్ల మందికి పైగా ప్రజలు ఉచితంగా అందించిన రేషన్‌ను తీసుకున్నారని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్రంలో మరో 3లక్షల మంది కొత్తగా బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. వారికి కూడా ఉచిత రేషన్ సరకులతో పాటు రూ.1000 ఆర్థిక సాయం అంధించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని మంత్రి వెల్లడించారు.
వారికీ ఉచిత రేషన్, రూ.వెయ్యి ఇవ్వాలని సీఎం ఆదేశించారు: నాని