‘కరోనా’ కట్టడికి ప్రత్యేక ఫార్మసీ యాప్

 ‘కరోనా’ నియంత్రణకు ఏపీ ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కొవిడ్-19 ఏపీ ఫార్మసీ ప్రత్యేక యాప్ ను ప్రవేశపెట్టింది. మెడికల్ షాపుల యజమానులు ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని, లాగిన్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. జ్వరం, దగ్గు, జలుబుతో మెడికల్ షాపులకు వచ్చే వారి వివరాలను ఈ యాప్ ద్వారా పొందుపరచాలని ఆదేశించింది. ‘కరోనా’పై ఏపీ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సహకరించాలని ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.