విశాఖలో పైపులైన్ నిర్మాణ పనుల్లో విషాదం!

విశాఖ నగరపాలక సంస్థ నీటి సరఫరా విభాగంపైపు లైన్ నిర్మాణ పనుల్లో విషాదం చోటుచేసుకుంది. నరవ వద్ద పైపును క్రేన్ తో పైకి ఎత్తే క్రమంలో హైటెన్షన్  విద్యుత్ లైన్ కు క్రేన్ తగిలింది. ఈ ఘటనలో క్రేన్ దగ్ధం కాగా, ఆపరేటర్ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.