కరోనా వైరస్ పది కొత్త రకాలుగా మారిందని భారత శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. వీటిలో ఏ2ఏ అనే రకం చాలా జోరుగా మానవ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తోందని తేలింది. పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్ (ఎన్‌ఐబీజీ) సంస్థ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ప్రస్తుత మహమ్మారికి కారణమైన సార్స్-కోవ్-2 వైరస్ తొలుత 2019 డిసెంబర్‌లో చైనాలో కనిపించింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ క్రమంలో అది భిన్న రకాలుగా మారింది. ప్రస్తుతం ఒ, ఎ2, ఎ2ఎ, ఎ3, బి, బి1 సహా 11 రకాలు ఉన్నాయి. వీటిలో ఒ అనేది చైనాలోని వుహాన్‌లో పుట్టిన మొట్టమొదటి కరోనా వైరస్ రకం. ఇది ఆ తర్వాత కొత్తగా 10 భిన్న రకాలను సృష్టించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిలోని ఎ2ఎ రకం వైరస్.. పెద్ద సంఖ్యలో మానవ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. అందువల్ల అది అన్ని దేశాలకూ విస్తరించిందన్నారు. 17 ఏళ్ల కిందట వచ్చిన సార్స్-కోవ్ వైరస్.. 8వేల మందికి సోకింది. 800 మందిని బలితీసుకుంది. అయితే అది కూడా ప్రస్తుత ఏ2ఏ రకం అంత ప్రమాదకరమైంది కాదని శాస్త్రవేత్తలు తెలిపారు.
కరోనాపై సంచలన నిజాలు చెప్పిన భారత శాస్త్రవేత్తలు...
• R UMADEVI