ఏపీలో వైద్య సేవలకు ఓలా క్యాబ్స్‌

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణాకు అనుకూలంగా ఓలా క్యాబ్‌లకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. నగరాల్లో వైద్య సదుపాయాలకు ఓలా సేవలను అనుమతించాలని ఆ సంస్థ కోరిన విషయం తెలిసిందే. దీనిని పరిశీలించిన ప్రభుత్వం అత్యవసర వైద్య సేవలకు ఓలా క్యాబ్‌లను అనుమతించాలని నిర్ణయించింది. డయాలసిస్‌, కేన్సర్‌, గుండె జబ్బు రోగులకే ఓలా క్యాబ్స్‌ సేవలు అందుతాయని తెలిపారు.