నాలుగురోజుల పాటు వర్షాలు

ఈశాన్య విదర్భ పరిసరాల్లో ఉపరిత ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలో నేటి నుంచి నాలుగురోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తా, రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విశాఖ, విజయనగరంలో పిడుగులు పడే అవకాశం ఉంది. కోస్తాకు తుపాను గండం పొంచివున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కోస్తా తీరం వైపు తుపాను వేగంగా కదులుతుంది. కోస్తా తీరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈనెల 27 నుంచి మే 1 మధ్య భారీ వర్ష సూచన ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మరో తుపాను చెలరేగనుంది. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.