మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ.వెయ్యి జరిమానా


ఏపీని కరోనా మహమ్మారి వెంటాడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుందని భావించినా.. కొన్ని జిల్లాల్లో మాత్రం ఆ సంఖ్య పెరుగుతోంది. ఇక గుంటూరు జిల్లాలో కేసులు పెరగడంతో పాటూ నర్సరావుపేటలో ఒకరు చనిపోయారు. ప్రస్తుతం జిల్లాలో 51 కేసులు ఉన్నాయి. దీంతో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు.. లాక్‌డౌన్‌ మరింత కఠినంగా గా అమ‌లు చేయాలని నిర్ణయించారు. నిబంధనల్ని కూడా పక్కాగా అమలు చేయాలని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు.