ఏపీలో గ్రామ సచివాలయాలకు రంగుల వ్యవహారంపై హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. రంగుల్ని వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. కానీ రంగులు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3 వారాల గడువు కోరింది. దీనికి హైకోర్టు ధర్మాసనం ఓకే చెప్పింది.
పంచాయతీ కార్యాలయాల రంగులు తీసేయాలని, ప్రభుత్వ కార్యాలయాలకు ఏ పార్టీతో సంబంధం లేని రంగులేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఇప్పటికే సూచించింది. తీర్పు అమలుకు మరికొంత గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.