జగన్ సర్కార్ రూ.5వేలు సాయం


పథకం వర్తించని వారు రాష్ట్ర వ్యాప్తంగా 2,500 మంది అర్చకులు ఉన్నారు. దీంతో అర్చకులు మాత్రమే ఏకాంతంగా నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. చిన్న ఆలయాలకు ఎలాంటి ఆదాయం లేదు.. అర్చకుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అందుకే అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ ద్వారా ఒక్కొక్కరికి రూ. 5000 గ్రాంట్ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.


కరోనా, లాక్‌డౌన్ వేళ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో భక్తుల దర్శనాల నిలిపివేయడంతో.. ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతో చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు రూ. 5,000లు గ్రాంట్‌ రూపంలో చెల్లించనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. దేవదాయ శాఖ నుంచి ఎలాంటి నెలవారీ జీతాలు పొందని, ధూప దీప నైవేద్యం వంటి పథకాల ద్వారా లబ్ధి పొందని వారికి అర్చక సంక్షేమ నిధి నుంచి ఈ సాయాన్ని అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,500మంది అర్చకులకు లబ్ది చేకూరనుంది.