కొవిడ్-19 పోరులో భాగంగా తాను 24x7 అందుబాటులో ఉంటానని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఎవరైనా, ఎప్పుడైనా తనకు ఫోన్ చేసి సలహాలు ఇవ్వొచ్చని, తమ అభిప్రాయాలను తనతో పంచుకోవచ్చని ప్రధాని స్పష్టం చేశారు. అందరం కలిసి పనిచేస్తేనే ఈ మహమ్మారిని నియంత్రించగలమని పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో కొవిడ్-19 పరిస్థితులు, మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ పొడిగింపుపై అభిప్రాయాలే లక్ష్యంగా నేడు ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే.
24X7 అందుబాటులో ఉంటా: మోదీ