వివిధ దేశాల ఎంబసీలతో మంత్రి గౌతంరెడ్డి భేటీ
న్యూఢిల్లీ, మార్చి6(ఆంధ్రజ్యోతి): ఏపీ పారిశ్రామికాభివృద్ధికి రష్యా సానుకూలంగా ఉన్నట్లు ఏపీ అధికార వర్గాలు తెలిపాయి. శుక్రవారం రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వివిధ దేశాల ఎంబసీలు, హైకమిషన్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు, నూతన పారిశ్రామిక విధానంలో ఇచ్చే వెసులుబాటు, రాయితీలను మంత్రి గౌతంరెడ్డి, పెట్టుబడుల వ్యవహారాల సలహాదారు పీటర్ హాసన్ వివరించారు. ఈ భేటీలో రష్యా, సౌదీ అరేబియా, సింగపూర్, ఐటీడీసీ ఛైర్మన్, ఇండియా టుడే గ్రూపు ఎడిటోరియల్ చీఫ్, యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఎండీ, ఎంజీ ఎడిటర్ ఆఫ్ సీఎన్‌బీసీ చానెల్ ప్రతినిధులు హాజరైనట్లు పీటర్ హాసన్ తెలిపారు. ఇక, సౌదీ అరేబియా కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినట్లు అధికార వర్గాలు తెలిపాయి.