విశాఖకు త్వరలో పరిపాలనా రాజధాని.. వైసీపీ కీలక నేత ఆసక్తికర వ్యాఖ్యలు




 







న్యూస్ చరిష్మా 


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన విధంగా త్వరలోనే విశాఖపట్నంకు పరిపాలనా రాజధాని రాబోతోందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వెల్లడించారు. విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతున్న తరుణంలో మేయర్‌ పీఠాన్ని కచ్చితంగా వైఎస్సార్‌సీపీ గెలవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఆదివారం విశాఖలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో విజయసాయిరెడ్డి ప్రసంగించారు.