అమరావతి: పేదలకు ఇంటి నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఇళ్ల డిజైన్‌పై దృష్టిసారించిన ప్రభుత్వం బెడ్‌రూం, కిచెన్, పెద్దహాల, వరండా, టాయిలెట్ సదుపాయాలతో ఇళ్లను నిర్మించే యోచనలో ఉంది. నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్లు ఒకే నమూనాలో నిర్మించనున్నారు. కాలనీల్లో డ్రైనేజీ, విద్యుత్, పచ్చదనం, తాగునీరు, కనీస మౌలిక సదుపాయాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నారు. ఏడాదికి 6.5 లక్షల చొప్పున ఇళ్ల నిర్మాణం చేసేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
పేదలకు ఇంటి నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ