ఇకపై ఔరంగాబాద్ విమానాశ్రయం పేరు ‘శంభాజీ మహారాజ్ విమానాశ్రయం’

ముంబై : ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్ విమానాశ్రయం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్ ఏయిర్‌పోర్టును పేరును ‘ఛత్రపతి శంభాజీ మహారాజ్ ఏయిర్‌పోర్ట్’ అని పేరు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి సుభాశ్ దేశాయ్ వెల్లడించారు.


ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా ఔరంగాబాద్ ఏయిర్‌పోర్టు పేరును మార్చాలని తీర్మానం చేసిందని, దానిని దృష్టిలో పెట్టుకునే ఈ తీర్మానం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వాటి దిశగానే తమ ప్రభుత్వం పయనిస్తోందని మంత్రి సుభాశ్ దేశాయ్ తెలిపారు. ఛత్రపతి శివాజీ కుమారుడే శంభాజీ మహారాజ్. ఆయన పేరునే ఔరంగాబాద్ విమానాశ్రయానికి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.