రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో అభిమాన గణం కలిగిన స్టార్ హీరోలలో సూపర్‌స్టార్ మహేష్ బాబు ఒకరు. ఆయన సినిమాల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తారు. ఇక, సోషల్ మీడియాలో అయితే మహేష్‌కు తిరుగే లేదు. సోషల్ మీడియాలో మహేష్‌కి ఉన్నంత ఫాలోయింగ్ దక్షిణాదిన మరే సెలబ్రిటీకీ లేదు. తాజాగా మహేష్ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది.
తాజాగా మహేష్ ట్విటర్ ఫాలోవర్స్ సంఖ్య 9 మిలియన్లకు (90 లక్షలు) చేరింది. ఇది సౌత్ ఇండియాలోనే రికార్డు. దక్షిణాదిన అత్యధిక ట్విటర్ ఫాలోవర్స్ కలిగిన సెలబ్రిటీ మహేష్ బాబే. సినిమా ముచ్చట్లతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటాడు మహేష్. అందుకే మహేష్‌కు సోషల్ మీడియాలో అంత ఫాలోయింగ్ ఏర్పడింది. తన ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య 9మిలియన్లు దాటిన సందర్భంగా మహేష్ అందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు.