బీజేపీ తరఫున కేంద్ర మంత్రుల ప్రచారం!
స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ కసరత్తు ప్రారంభించింది. ప్రచార పర్వంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలకం కానున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలు సహా 8 జిల్లాల్లో పవన్ సుడిగాలి పర్యటనలు చేయనున్నారని తెలుస్తోంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తిగానే ప్రచారం ప్రారంభించనున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క, బీజేపీ తరఫున ప్రచారానికి ఏకంగా కేంద్ర మంత్రులే రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే, కీలక జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను జనసేన పార్టీ సమన్వకర్తలకు అప్పగించారు. బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ ఇరుపార్టీల నేతల బలాబలాలను పరిశీలించి, ఎవరు బలమైన అభ్యర్థి అనుకుంటే వారికే సీటు కేటాయించాలని నిర్ణయించారు.