హ్రాడూన్ (ఉత్తరాఖండ్): ఆవు పేడతో కరోనా వైరస్ వ్యాధిని నయం చేయవచ్చని ఇటీవల అసోం రాష్ట్ర బీజేపీ శాసనసభ్యురాలు చేసిన వ్యాఖ్యలు మరవకముందే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మరో బీజేపీ ఎమ్మెల్యే గోమూత్రం కరోనా వైరస్‌ను చంపుతుందని వ్యాఖ్యానించి సంచలనం రేపారు. గోమూత్రం కరోనా వైరస్‌ను చంపుతుందని హరిద్వార్‌లోని లక్సార్ ప్రాంతానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ గుప్తా చెప్పారు. ఆవు మూత్రంలో యాంటీ వైరస్ లక్షణాలున్నాయని, గోమూత్రాన్ని తాగితే కరోనా వైరస్ ను నివారిస్తుందని సంజయ్ గుప్తా చెప్పారు. హిందూమతాచారం ప్రకారం యజ్ఞం చేస్తే గాలిలోని కరోనా వైరస్ చంపడానికి సహాయపడుతుందని గుప్తా పేర్కొన్నారు.ఆవు పేడతో ఇల్లు అలికితే ఎలాంటి వైరస్ ఇంట్లోకి రాదని, ఆవుపేడ క్రిమిసంహారక మందు అని నిరూపితమైందని చెప్పారు. కాగా ఉత్తరాఖండ్ కు 437 మంది ప్రజలు విదేశాల నుంచి వచ్చారని, వీరిలో 319 మందిని ముందుజాగ్రత్త చర్యగా ఆసుపత్రిలో చేర్పించామని ఉత్తరాఖండ్ మంత్రి చెప్పారు. ఉత్తరాఖండ్ పోలీసు విభాగంలో కరోనా వైరస్ వ్యాపించకుండా నియంత్రించేందుకు ముందుజాగ్రత్త చర్యగా బయోమెట్రిక్ వ్యవస్థను నిలిపివేశామని మంత్రి చెప్పారు.కరోనావైరస్ గురించి వదంతులను వ్యాప్తి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డెహ్రాడూన్ కలెక్టరు హెచ్చరించారు.
గోమూత్రం తాగితే కరోనా వైరస్ దూరం ..బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు