కరోనా ఎఫెక్ట్.. టీటీడీ కీలక నిర్ణయం


దేశంలో కరోనా ప్రభావం తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నారైలు, విదేశీ భక్తులు ఇండియాకు వచ్చిన 28 రోజుల పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి రావొద్దని విజ్ఞప్తి చేసింది.


నిరంతరం లక్షలాది మంది భక్తులతో తిరుమల దేవాలయం కిటకిటలాడుతుంటుందని, కాబట్టి ఈ ప్రదేశంలో కరోనా వైరస్ మరింతగా విజృంభించే అవకాశం ఉందని పేర్కొంది. కాబట్టి విదేశాల నుంచి వచ్చే భక్తులు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే అస్వస్తతగా ఉన్న భక్తులు దైవ దర్శనను వాయిదా వేసుకోవాలని ఇప్పటికే టీటీడీ భక్తులకు కోరింది. కాగా, శబరిమల దేవస్థానం బోర్డుమార్చి నెల ముగిసే వరకు ఆలయానికి రావొద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ ప్రెసిడెంట్ ఎన్.వాసు మంగళవారం (మార్చి 10) మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.


ప్పటివరకు 4,091 మంది మృతి చెందారు. 1,16,711 మంది ఈ వైరస్ బారినపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒక్క చైనాలోనే ఇప్పటి వరకు 3,136 మంది చనిపోయారు. చైనా తర్వాత ఇటలీ రెండో స్థానంలో ఉంది. కరోనా కారణంగా ఇటలీలో 463 మంది మృతి చెందగా.. ఇరాన్‌లో 291 మంది, దక్షిణ కొరియాలో 54 మంది, అమెరికాలో 28 మంది, ఫ్రాన్స్‌లో 30 మంది, స్పెయిన్‌లో 31 మంది, జపాన్‌లో 10 మంది, యూకేలో ఐదుగురు, నెదర్లాండ్స్ నలుగురు, ఆస్ట్రేలియాలో ముగ్గురు, హాంగ్‌కాంగ్‌లో ఇద్దరు, స్విట్జర్లాండ్‌లో ఇద్దరు మరణించారు. ఇరాన్‌లో పరిస్థితి భయానకంగా ఉంది. గత 24 గంటల్లో అక్కడ 54 మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. భారత్‌లో ఇప్పటివరకు 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి