ప్రకాష్ తో అనుష్క పెళ్లి.. ఆగని రూమర్లు!


టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి మ్యారేజ్ రూమర్లు మీడియాలో రావడం కొత్తేమీ కాదు. గత కొన్నేళ్లుగా అనుష్క వివాహానికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ తో పెళ్లి అని ఇప్పటికి టాలీవుడ్ మీడియాలోనే కాదు బాలీవుడ్ మీడియాలో కూడా చాలాసార్లు కథనాలు వెలువడ్డాయి.  ఇద్దరూ ఖండించినప్పటికీ అవి మాత్రం ఆగలేదు. ఇదిలా ఉంటే తాజాగా అనుష్క వివాహం దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి జరగబోతోందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  


దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తనయుడే ఈ ప్రకాష్.  అనుష్క హీరోయిన్ గా నటించిన 'సైజ్ జీరో' కు దర్శకుడు ప్రకాష్. ఈమధ్య బాలీవుడ్ లో కంగనా రనౌత్.. రాజ్ కుమార్ రావ్ లతో 'జడ్జిమెంటల్ హై క్యా'  అనే సినిమాను కూడా రూపొందించాడు. ప్రకాష్  తన భార్య కనిక ధిల్లాన్ నుంచి విడాకులు తీసుకుని ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్నాడు. అయితే అనుష్క ఎన్నిసార్లు తన వివాహంపై వచ్చిన వార్తలను రూమర్లంటూ కొట్టిపారేసినా ఇలా ఏదో ఒక గాసిప్పు వస్తూ ఉండడం ఆశ్చర్యకరం.

ఇదిలా ఉంటే అనుష్క తాజా చిత్రం 'నిశ్శబ్దం' ఏప్రిల్ 2 న రిలీజ్ కానుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్. మాధవన్ హీరోగా నటిస్తున్నారు.  అంజలి.. షాలిని పాండే.. మైఖేల్ మ్యాడ్సెన్ ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు.