మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌‌ నియామకంపై అశోక్‌ గజపతిరాజు స్పందన


విజయనగరం: మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ నియామకంలో ప్రభుత్వ తీరును టీడీపీ సీనియర్ నేత అశోక్‌ గజపతిరాజు తప్పుపట్టారు. వైసీపీ ప్రభుత్వ తీరు వింతగా ఉందని వ్యాఖ్యానించారు. చైర్మన్‌గా వేరే మతం వారిని నియమిస్తే సమస్యలు వస్తాయని తెలిపారు. అయినా ప్రభుత్వ జీవోను ఇప్పటివరకు బయటపెట్టలేదని చెప్పారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ పరిధిలో 105 ఆలయాలు ఉన్నాయని వెల్లడించారు. ట్రస్ట్‌, దేవాదాయ భూములపై ప్రభుత్వం కన్నేసిందని ఆరోపించారు. దాతల భూములు ఆలయాలకే చెందాలని అశోక్‌ గజపతిరాజు డిమాండ్ చేశారు.