మహానుభావులు


భారతీయ వైద్యశాస్ర్తానికి చరకుడు పితామహుడు. ఆయన రాసిన చరక సంహిత అనే వైద్యశాస్త్రగ్రంథంలో అనేక వ్యాధుల లక్షణాలు, వాటి నివారణ మార్గాలను సులభరీతిలో వివరించాడు. ఆరోగ్యంగా జీవించాలంటే జీర్ణక్రియ, జీవక్రియ, రోగనిరోధక శక్తి అనేవి అత్యంత ముఖ్యమని 2000 ఏండ్లకు పూర్వమే చెప్పారు. ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం చేయించుకోవటంకంటే వ్యాధి రాకుండా చూసుకోవటమే ఉత్తమమని ఇప్పుడు చాలామంది వైద్యులు చెప్తున్నారు. ఈ సూచన మొదట చేసింది చరకుడే. ప్రస్తుతం బాగా వ్యాప్తిలో ఉన్న జెనెటిక్స్‌పై ఆనాడే చరకుడు చర్చించాడు. కనిష్క చక్రవర్తి ఆస్థానంలో ఆయన రాజవైద్యుడిగా ఉండేవాడు.