విజయవాడ: లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై విజయవాడలో అధికారులు నేటి నుంచి చర్యలను మరింత కఠినం చేయనున్నారు. నేటి నుంచి బహిరంగ స్థలాల్లోకి రైతు బజార్లను మార్చనున్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య ప్రజలు బయటకు వచ్చేందుకు అనుమతి లేదు. నగరం వెలుపలతోపాటు నగరంలో రాకపోకలన్నింటినీ బంద్ చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నిన్న ఒక్కరోజే 70 కేసులు నమోదు చేశారు.
నిబంధనలు ఉల్లంఘించే వారిపై నేటి నుంచి చర్యలు మరింత కఠినం